Polimera 3 Official Announcement: పొలిమేర 3 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..ట్విస్టులతో పోయించడానికి మేకర్స్ సిద్ధం

Polimera 3 Official Announcement: పొలిమేర 3 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..ట్విస్టులతో పోయించడానికి మేకర్స్ సిద్ధం

సత్యం రాజేష్,కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర'సీరిస్ ప్రేక్షకుల్లో ఒక సెపరేట్ బజ్ క్రియేట్ చేసింది.సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియాన్స్ ను పొలిమేర 1ఓటీటీ ఆడియన్స్ ను సెకండ్ పార్ట్ తో థియేటర్లలోకి వచ్చేలా చేసింది.ఇక సెకండ్ పార్ట్ లో వదిలిన ట్విస్ట్స్ ఉహకందని విధంగా ఉండటంతో మేకర్స్ పార్ట్ 3 పై చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. 

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ సినిమాల్లో ఒకటైన పొలిమేర సినిమాకు మరో సీక్వెల్ వస్తుందంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.తాజాగా పొలిమేర 3 రానున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.పొలిమేర 2 క్లైమాక్స్‌లో యాక్టర్ పృథ్వీరాజ్ చెప్పే "లెట్స్ బిగిన్ ది షో" డైలాగ్‌తో పొలిమేర 3 గ్లింప్స్ షురూ అయి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచింది.

ALSO READ | Kiran Abbavaram: ‘క’ అంటున్న కిరణ్ అబ్బవరం..ఒక్క అక్షరంతో రూ.20 కోట్ల బడ్జెట్..హిట్ దక్కేనా?

అయితే,ఈ గ్లింప్స్ మా ఊరు పొలిమేర,పొలిమేర 2 సినిమాలోని సన్నివేశాలతోనే సాగుతూ..పొలిమేర 3లోడింగ్ అంటూ షేర్ చేసిన ఈ వీడియో గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఈ మేరకు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ పోస్టర్ విడుదల చేస్తూ.."స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది,ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాము.ఈ సారి ఇంక ఎక్కువ భయపెడతం,అనేక ట్విస్ట్ లతో మీ ఊహకందని విధంగా ఉండబోతోంది త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు".పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న పొలిమేర 3 ఎలా భయపెట్టనుందో చూడాలి.అలాగే ఈ సినిమాలో సత్యం రాజేష్,కామాక్షి భాస్కర్ల,బాలాదిత్య, గెటప్ శ్రీను,రాకేందు మౌళి, పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.  

అయితే,ఇప్పుడు పొలిమేర 3ని థియేటర్లలో రిలీజ్ చేస్తారా..లేదా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి ప్లాన్ చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ థియేటర్ లో రిలీజ్ అయితే మాత్రం..ఓటీటీ స్ట్రీమింగ్ పై ప్రేక్షకుల్లో సందేహం కలిగిస్తుంది.ఎందుకంటే,థియేట్రికల్ రన్ ముగిసాకా పొలిమేర 3 డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లేదా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే సమాచారం.మొదటి పార్ట్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాగా..సెకండ్ పార్ట్ మాత్రం ఆహాలో స్ట్రీమ్ అయింది.ఇక పార్ట్ 3 ఎక్కడనేది తెలియాల్సి ఉంది.