
మహబూబాబాద్, వెలుగు : బీఆర్‌ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మ తిరగడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు.
పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్లను బహిరంగంగా వేలం వేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాల కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లు ఆచరణలో సాధ్యం కాదన్నారు. ఆ స్కీమ్‌లను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నరసింహుల మాజీ సర్పంచ్ బండ భిక్షం రెడ్డి, కొమ్మినేని రవీందర్, ఖాజామియా, వెంకటనారాయణగౌడ్, రవీందర్, రాము గౌడ్, నల్ల ఆంజనేయులు, ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, గుగులోతు ఖీమా పాల్గొన్నారు.