మహిళా హక్కుల కోసం పోరాడుతున్న లవ్ జైనల్ హాత్ లౌ అనే యువతికి సౌదీ కోర్ట్ 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. రియాద్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. ఈ తీర్పు అమెరికా, సౌదీ సంబంధాలకు కొత్త సవాల్‌గా మారే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా బాధితురాలు సోదరి లీనా మాట్లాడుతూ సౌదీ రాజకీయ వ్యవస్థలో మార్పు, జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలను హత్లౌల్ ఎదుర్కొంటున్నారు. ఆమెపై తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదయినట్టు సౌదీ మీడియా వెల్లడించింది. మే15, 2018 లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో 5ఏళ్ల 8నెలల జైలు శిక్ష విధించారని, అభ్యర్ధనతో కోర్ట్ కొన్ని షరతులు విధిస్తూ 2సంవత్సరాల 10నెలల పాటు శిక్ష తగ్గించినట్లు చెప్పింది. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నా ఆమె పూర్తి స్థాయి జైలు శిక్ష మార్చి 2021తో ముగియనుందని, ఒకవేళ ఏదైనా నేరానికి పాల్పడితే తిరిగి జైలు పంపే అవకాశం ఉందనిమీడియా తెలిపింది. నా చెల్లెలు టెర్రరిస్ట్ కాదు. హక్కుల కోసం పోరాడే ఫైటర్. ఆమెకు తాజా జైలు శిక్షతో ఎంబీఎస్ మరియు సౌదీ ప్రభుత్వం గర్వంగా ఫీలవుతుందన్నారు.
