ఏడు దేశాల విమాన రాకపోకలపై సౌదీ అరేబియా నిషేధం 

ఏడు దేశాల విమాన రాకపోకలపై సౌదీ అరేబియా నిషేధం 

ఆఫిక్రా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కలకలం సృష్టిస్తోంది. ఇది అత్యంగా వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచ దేశాలు అలర్టయ్యాయి. ఇందులో భాగంగా వైరస్‌ ప్రభావం అత్యధికంగా ఉన్న ఏడు దేశాలకు చెందిన విమాన రాకపోకలపై  సౌదీ అరేబియా  నిషేధించింది. ఇందులో దక్షిణాఫ్రికా, జింబాంబ్వే, బోట్స్‌వానా, మొజాంబిక్‌, లెసోథో, ఎస్వతినీ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పర్యాటకులకు సౌదీకి అనుమతిలేదని అధికారులు ప్రకటించారు. అయితే ఇతర దేశాల్లో 14 రోజులు ఉన్న తర్వాత, సౌదీ ఆరోగ్య నియమాలు పాటిస్తే వారికి తమ దేశంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఇది సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు.

ఇప్పటికే ఈ ఏడు దేశాల ప్రయాణికులపై జోర్డాన్‌ కూడా నిషేధం విధించింది. జోర్డాన్‌కు చెందినవారు కాకుండా ఈ దేశాలకు చెందినవారికి అనుమతిలేదని స్పష్టం చేసింది.
కాగా, గత కొన్ని రోజులుగా దక్షిణాఫ్రికాలో రోజూవారీ సగటు కేసులు 200కుపైగా నమోదవుతున్నాయి.