బిచ్చగాళ్లు, జేబు దొంగలను పంపించొద్దు : పాకిస్తాన్ కు సౌదీ వార్నింగ్

బిచ్చగాళ్లు, జేబు దొంగలను పంపించొద్దు : పాకిస్తాన్ కు సౌదీ వార్నింగ్


పాకిస్తాన్ దేశానికి.. సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చింది. మీ దేశం నుంచి బిచ్చగాళ్లు, జేబు దొంగలను పంపిచొద్దు అంటూ హెచ్చరించింది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో సౌదీ అరేబియాలో జేబు దొంగలు, ఇతర దొంగతనాలు చేసే వాళ్లను అరెస్టు చేస్తే.. వారిలో 90 శాతం మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు 

వీళ్లందరూ ఇప్పుడు సౌదీ జైళ్లల్లో ఉన్నారు. పాక్ దేశం నుంచి హజ్ యాత్రికుల ముసుగులో లక్షల మంది సౌదీ అరేబియా చేరుతున్నారు. అలా వచ్చినోళ్లు ఇలాంటి పనులు చేస్తున్నట్లు గుర్తించింది సౌదీ అరేబియా. ఇప్పుడు ఈ పరిణామాలు.. సౌదీకి తలనొప్పిగా మారాయి. 

హజ్ యాత్రికుల ముసుగులో పాకిస్తాన్.. బిచ్చగాళ్లను, జేబు దొంగలను సౌదీ పంపిస్తుందని.. వాళ్లు ఇక్కడకు వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారనేది సౌదీ ఆరోపిస్తోంది.  దాదాపు 90 శాతం మంది పాకిస్తానీలు  హజ్ యాత్ర పేరుతో పాకిస్తాన్  వస్తున్నారని రానా మహమూదుల్ హసన్ కకర్ ఫోరమ్‌తో చెప్పారు. మక్కాలోని గ్రాండ్ మసీదులో అరెస్టయిన పిక్ పాకెట్లలో ఎక్కువ మంది పాకిస్థానీ జాతీయులేనని సౌదీ అరేబియా పాక్ అధికారులకు చెప్పిందన్నారు. పాకిస్తాన్ బిచ్చగాళ్ల కారణంగా సౌదీలోని జైళ్లు  సరిపోవడం లేదన్నారు.