బిచ్చగాళ్లను మా దేశానికి పంపొద్దు... పాకిస్తాన్​కు సౌదీ వార్నింగ్​

బిచ్చగాళ్లను మా దేశానికి పంపొద్దు... పాకిస్తాన్​కు సౌదీ వార్నింగ్​

రియాద్: యాత్రికుల ముసుగులో పాకిస్తానీ బిచ్చగాళ్లు తమ దేశంలోకి వస్తున్నారని సౌదీ అరేబియా ఆరోపించింది. బిచ్చగాళ్లకు వీసాలిచ్చి తమ దేశానికి పంపొద్దని పాక్​ను హెచ్చరించింది. ఈమేరకు పాకిస్తాన్ కు చెందిన ‘ది ఎక్స్ ప్రెస్  ట్రిబ్యూన్’ ఓ కథనం ప్రచురించింది. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే, పాకిస్తానీ ఉమ్రా, హజ్ యాత్రికులపై తీవ్రంగా ప్రభావం ఉంటుందంటూ హెచ్చరిం చిందని తెలిపింది. ‘‘పాక్ బిచ్చగాళ్లు మా దేశంలోకి రాకుండా చూడాలని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ.. పాక్​కు హెచ్చరిక పంపింది.

ఉమ్రా వీసాలతో కొందరు పాకిస్తానీ బిచ్చగాళ్లు వారి దేశంలోకి చొరబడ్డారని తెలిపింది. బిచ్చగాళ్లు తమ దేశంలోకి రాకుండా చూడాలని కోరింది” అని ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉమ్రా చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని పాకిస్తాన్  నిర్ణయించింద ని తెలిపింది.