సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత లీడ్ రోల్స్‌లో కృష్ణమాయ దర్శకత్వంలో వి. విజయ నిర్మించిన చిత్రం ‘సాV3’. గురువారం ఈ మూవీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘నేను నిర్మించిన ‘ఈశ్వర్’లో ప్రభాస్ గారికి ఫ్రెండ్‌గా నటించిన కృష్ణమాయ ఇప్పుడు దర్శకుడై, ఆ సినిమా రీరిలీజ్‌కు ట్రిబ్యూట్‌గా ఈ ప్రెస్‌మీట్ నిర్వహించడం సంతోషంగా ఉంది. ‘సాV3’ చిత్రం పాటలు బాగున్నాయి, సినిమా కూడా బాగా తీశాడు.
మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ ‘ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ ఫస్ట్ మూవీలో మేమంతా కలిసి నటించాం అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఇక నేను దర్శకనిర్మాతగా సరికొత్త కంటెంట్‌తో ఈ సినిమా తీశా. త్వరలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పాడు.
నటుడు అదిరే అభి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత, శ్రావణ సంధ్య, హారిక రవి పాల్గొన్నారు.
