'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ రివ్యూ.. కామెడీ కమ్ ఎమోషన్స్

 'సేవ్ ద టైగర్స్'  వెబ్ సిరీస్ రివ్యూ.. కామెడీ కమ్ ఎమోషన్స్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ "సేవ్ ద టైగర్స్". ప్రియదర్శి, కృష్ణ చైతన్య, అభినవ్ గోమఠం,'జోర్దార్' సుజాత, పావనీ గంగిరెడ్డి, దేవయాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.

భార్యా,భర్తల మధ్య సహజంగా వచ్చే  చిన్న చిన్న గొడవలు, గిల్లికజ్జాలు, అభిప్రాయ బేధాలు ఇవే ఈ సిరిస్ ఈ నేపథ్యం. ఇలాంటి పాయింట్ తో తెలుగులో ఇప్పటికి చాలా సినిమాలే వచ్చాయి. కానీ.. వాటికీ ఈ సిరీస్ కి తేడా ఏంటంటే? ఇది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ప్రెసెంట్ జనరేషన్ జంటల మధ్య రెగ్యులర్ గా ఉండే పరిస్థితులకి కాసింత వినోదాన్ని జోడించి చాలా చూపించారు. అందుకే.. సినిమా చూసే ఎవరైనా ఈజీ గా కనెక్ట్ అవుతారు. వాళ్ళని వాళ్ళు ఈ కథతో రిలేట్ చేసుకుంటారు.

సిరీస్ ఎంత సహజంగా ఉంటుందో.. కథలో సందేశాన్ని కూడా అంతే చక్కగా చూపించారు. కావలసినంత కామెడీ, కోరుకున్నంత సెటైర్, పదే పదే గుర్తొచ్చేంత ఫన్, ఊహలకు అందనంత డ్రామా.. అన్నీ కలిసిన ఒక సరికొత్త సిరీస్ "సేవ్ ద టైగర్స్". వీలుంటే మీరు కూడా ఓ లుక్కేయండి.