మీకు తెలుసా : ప్రతి సారీ.. ప్రతి చిన్న దానికీ సారీ.. సారీ అని చెప్పొద్దు.. అలా చెబితే వచ్చే నష్టాలు ఇవే..!

మీకు తెలుసా : ప్రతి సారీ.. ప్రతి చిన్న దానికీ సారీ.. సారీ అని చెప్పొద్దు.. అలా చెబితే వచ్చే నష్టాలు ఇవే..!

ప్రతీ ఒక్కరి జీవితంలో 'సారీ' చెప్పని రోజు ఉండదు. బస్సులో చూడకుండా ఎవరినైనా తగిలితే 'సారీ', ఫ్రెండ్ రమ్మన్న చోటుకి రెండు నిముషాలు లేట్ గా వెళ్తే 'సారీ', ఎదుటివాళ్లు చెప్పింది సరిగా వినపడక పోతే 'సారీ', అలా రోజులో ఓపది 'సారీ'లు అలవోకగా వచ్చేస్తుంటాయ్. ఈ మాట చేసే మ్యాజిక్ అలా ఉంటుంది మరి. అందుకే దీన్ని 'మ్యాజిక్ వర్డ్' అంటారు. అయితే 'సారీ'ని నిజంగా చెప్పాల్సిన పద్ధతిలో, చెప్పాలనుకున్న అర్థంలో చెప్తున్నారా.. తెలుసుకోండి..

ప్రతి దానికి సారీ చెప్పడం మంచి హ్యాబిట్ .. అని చాలామంది అనుకుంటుంటారు. మంచిదే. కానీ దీనివల్ల నష్టం కూడా ఉందంటున్నారు పరిశోధకులు.   ఇటీవల  జరిపిన కొన్ని రీసెర్చ్ 'సారీ' ఎక్కువగా చెప్పడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బ తింటుందనీ తేలింది. 

ఒక మనిషి రోజుకి యావరేజ్​ గా  ఎనిమిది నుంచి ఇరవై సార్లు సారీ చెప్తారంట. అయితే. ఇన్ని సార్లు పారీ చెప్పడం మంచిది కాదని. దీని వల్ల కాన్ఫిడెన్స్ తగ్గుతుందనీ, ఎదుటి వ్యక్తికి మీపై  చెడు అభిప్రాయం ఏర్పడుతుందని  స్టడీలు చెప్తున్నాయి. ఏదైనా పెద్ద పొరపాటు జరిగి ఎదుటి వ్యక్తి బాధపడుతున్నప్పుడు సారీ చెప్పడం బాగుంటుంది. అలా కాకుండా. అయినదానికి, కానిదానికి సారీ చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదట.

ఎందుకు నష్టం?

'సారీ' అన్న పదాన్ని ఎక్కువగా మహిళలే వాడుతున్నట్టు సర్వేలో తేలింది. 'సారీ' చెప్పి ప్రతి సిచ్యుయేషన్లో ఎంతో కొంత ఎమోషనల్- అయ్యే అవకాశం ఉంటుంది. అలవాటులో భాగంగా చెప్పినా.. దాని ప్రభావం వ్యక్తిత్వంపై ఎంతో కొంత ఉంటుంది.

"నేను తప్పు చేశాను" అన్న ఫీలింగ్ ఒక శాతం అయినా ఉంటుందట. అందుకే ప్రతి దానికి సారీ చెప్పడం వల్ల ఆడవాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గి, మనసులో కొద్దిపాటి గిల్టీ ఫీలింగ్ కలిగి, రానురాను తమని తాము తక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 'సారీ చెప్పడం ఒక హ్యాబిట్​లా కాకుండా అవసరానికి తగ్గట్టు ఆలోచించి చెప్పడం అవసరమని పరిశోధకులు అంటున్నారు. 

ఏం చేయాలి?

  • 'సారీ సిండ్రోమ్' నుంచి బయటపడాలంటే.. కొన్ని మార్గాలున్నాయి. మన వల్ల ఏదైనా తప్పు జరిగినా, తెలియకుండా పొరపాటు చేసినా. దానికి సారీ చెప్తుంటాం. అయితే కొన్ని సార్లు తప్పు లేకపోయినా ఓవర్ సెన్సిటివిటీ వల్ల ప్రతీదానికి సారీ చెప్పడం అలవాటైపోతుంది. అందుకే సారీ చెప్పేముందు తప్పు ఉందా లేదా అన్న విషయాన్నీ పరిశీలించుకొని చెప్పాలి.

రీప్లేస్ విత్ థ్యాంక్యూ:  ఇది  ప్రతిసారి సారీ చెప్పేబదులు. వీలైనన్ని సార్లు  థ్యాంక్యూ  చెప్తే ఎంతో బెటర్. సారీ వెగెటివ్ ఎక్స్ ప్రెషన్ అయితే థ్యాంకు పాజిటివ్​ ఎక్స్​ప్రెషన్​. అందుకే సారీని థ్యాంక్స్​ తో రీ ప్లేస్​ చేయాలి.

కాసేపు ఆగి: సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు వెంటనే చెప్పేయకుండా ఒక పది సెకన్లు పాజ్ తీసుకోవాలి. ఈ టైంలో నిజంగా 'సారీ' చెప్పాల్సిన అవసరం ఉందో లేదో అర్థమైపోతుంది. మాటి మాటికి సారీ చెప్పడం హ్యాబిట్​గా మారిన వాళ్లకు ఈ టెక్నిక్​ వాగా పనికొస్తుంది.

స్టే  సైలెంట్ :  ఒక్కోసారి ఏమీ మాట్లాడకపోవడమే మంచి సమాధానం అవుతుంది. తెలియక జరిగిన పొరపాట్లలో వెంటనే సారీ చెప్పి తప్పు మీద వేసుకోకుండా సైలెంట్ గా ఉండడం వల్ల జరిగిందేంటో మిగతా వాళ్లకు కూడా అర్థమవుతుంది.

రిలేషన్స్ లో....  తప్పులు జరిగినప్పుడు.. సారీ చెప్పడం వల్ల తప్పు ఒప్పు కాదు. అందుకే ఒక్క 'సారీ' వదిలేయకుండా డిఫరెంట్ గా అపాలజీ చెప్పొచ్చు. 

ఎలాగంటే..

 రిలేషన్ షిప్ సారీ చెప్పాల్సి వస్తే 'సారీ'కి బదులు ఓ కప్పు కాపీ ఆఫర్ చేయడమో. షాపింగ్ కి తీసుకెళ్లడమో చేయాలి.
సారీ చెప్పాల్సిన వాళ్లు అంత క్లోజ్ కాకపోతే ... ఓ ఫ్లవర్ ఇవ్వొచ్చు. అలాగే  ఫ్రెండ్స్​కి డిఫరెంట్ గా అపాలజీ చెప్పాలంటే "సారీ' అని కార్డ్ బోర్డ్ మీద రాసి దాన్ని గోడకు తగిలించి ఒక సెల్ఫీ తీసుకొని పంపించొచ్చు. ఇలా చేయడం ద్వారా నెగెటివ్ ఎక్స్​ ప్రెషన్ కాస్తా పాజిటివ్ గా మారుతుంది.

రెండు రకాలు

అనవసరంగా సారీ చెప్పడం ఎంత నష్టమో. అవసరమైనప్పుడు చెప్పకపోవడమూ అంతే నష్టం.. పొరపాటు జరిగినప్పుడు గమ్మున ఉండకుండా సందర్భం చూసి సారీ చెప్పాలి. సారీ చెప్పడంలో కూడా రెండు రకాలుంటాయి..అదెలాగంటే... 'నా జోక్ హర్ట్ అయితేసారీ.. నాదే తప్పు.. నేనలా అనుండకూడదు. ఇంకోసారి అలా జరగదు' అనడానికి. "నేను వేసిన జోకి నువ్వు హర్ట్ అయినట్లున్నావ్. సారీ, కానీ నిన్ను నొప్పించడం నా ఉద్దేశం కాదు. సరదాగా అన్నానంతే... 'అనడానికి చాలా తేడా ఉంది. తేడా గమనించి సారీ చెప్పాలి.

ఎప్పుడు చెప్పాలో తెలియాలి

'సారీ' అన్నది వినదానికీ, పలకడానికీ ఎంత సులువుగా ఉన్నా అది పెదాల చివరి నుంచి వచ్చే మాట కాదు. గుండె లోతుల్లోంచి రావాలి.  అందులో తప్పు నాదే... అందుకు రిగ్రైట్ అవుతున్నాను... తప్పు సరిదిద్దుకోడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్తపడతాను"...అనే నాలుగు విషయాలు వినిపించాలి.అలాకాకుండా అన్ని మాటల్తో పాటే సారీ'ని కూడా మాటిమాటికి వాడేస్తే దాని వాల్యూ పోతుంది. అందుకే 'సారీ' చెప్పేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి