ఎస్‭బీఐ నుంచి రూ.10వేల కోట్ల ఇన్ ఫ్రా బాండ్లు

ఎస్‭బీఐ నుంచి రూ.10వేల కోట్ల ఇన్ ఫ్రా బాండ్లు

న్యూఢిల్లీ: 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్లను సమీకరించే ప్రతిపాదనను ఆమోదించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) బోర్డు మంగళవారం తెలిపింది.  ఇందులో రూ. 5,000 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్​ కూడా ఉంటుంది.  పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్ ద్వారా ఈ డబ్బును సేకరిస్తామని ఎస్‌‌‌‌బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. ఇటీవల  ఎస్​బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా విలేఖరులతో మాట్లాడుతూ, బ్యాంక్ నికర నాన్- పెర్ఫార్మింగ్ అసెట్ రేషియోను ఒక శాతం కంటే తక్కువగా ఉంచుతామని, ప్రస్తుత క్రెడిట్ వృద్ధిని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్​లో ఎస్​బీఐ​ లాభం 74శాతం వార్షికంగా జంప్ చేసి రూ.13,265 కోట్లకు చేరింది. లోన్​ లాస్​ ప్రొవిజన్లు తగ్గాయి.  

​2023 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో నిర్వహణ లాభం వార్షికంగా16.82శాతం పెరిగి రూ.21,120 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం 12.83శాతం వార్షికంగా పెరిగి రూ.35,183 కోట్లకు చేరుకుంది. లోన్ బుక్ 20శాతం,  డిపాజిట్లు 10శాతం పెరిగాయి. ఎస్​బీఐ ఎన్​పీఏలు 2023 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 3.91 శాతం నుండి రెండో క్వార్టర్​లో 3.52 శాతానికి తగ్గాయి. నికర ఎన్​పీఏలు 2022 జూన్  క్వార్టర్​లో ఒక శాతంగా రికార్డయ్యాయి. ఇవి 2021 సెప్టెంబర్ క్వార్టర్​లో 1.52 శాతం నుండి  2022 సెప్టెంబర్ క్వార్టర్​లో 0.8 శాతానికి పడిపోయాయి. డిపాజిట్లను ఆకర్షించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 14–16శాతం క్రెడిట్ వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఎస్​బీఐ తెలిపింది. బ్యాంక్​కు రూ.2.5 లక్షల కోట్ల విలువైన టర్మ్ లోన్లు ఉన్నాయని, అన్ని రంగాల నుండి డిమాండ్‌‌‌‌ను ఆశిస్తున్నామని సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు.