SBI Jobs: డిగ్రీ చదివి బ్యాంకు జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నారా..? ఎస్బీఐలో 3 వేల జాబ్స్ పడ్డయ్.. శాలరీ 50 వేలు..

SBI Jobs: డిగ్రీ చదివి బ్యాంకు జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నారా..? ఎస్బీఐలో 3 వేల జాబ్స్ పడ్డయ్.. శాలరీ 50 వేలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఎస్బీఐ) 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎస్బీఐ వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే 29.

పోస్టులు
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ 2964(ఎస్సీ 387, ఎస్టీ 190, ఓబీసీ 697, ఈడబ్ల్యూఎస్ 260, జనరల్ 1600, పీడబ్ల్యూబీడీ 109, బ్యాక్​లాగ్ ఎస్సీ, ఎస్టీ 364, బ్యాక్​లాగ్ పీడబ్ల్యూబీడీ 250) తెలంగాణలో 230 పోస్టులు( ఎస్సీ 34, ఎస్టీ 17, ఓబీసీ 62, ఈడబ్ల్యూఎస్ 23, జనరల్ 94)

ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
కనిష్ట వయోపరిమితి 21 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు.(1995, మే 1 కంటే ముందు.. 2004, ఏప్రిల్ 30 తర్వాత జన్మించిన వారై ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీలకు 15 ఏండ్లు, పీడబ్ల్యూబీడీ ఓబీసీలకు 13ఏండ్లు, పీడబ్ల్యూబీడీ జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్​లకు 10 ఏండ్లు, ఎక్స్ సర్వీస్​మెన్​లకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే ‌‌09.

లాస్ట్ డేట్: మే 20.

అఫ్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ 

ఆన్​లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్​లైన్ టెస్ట్
ఆన్​లైన్ టెస్టులో ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 125 మార్కులకు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్టులో ఇంగ్లీష్​ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్​నెస్/ ఎకానమీ, కంప్యూటర్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు, బ్యాంకింగ్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు, ఎకానమీ 25 ప్రశ్నలు, కంప్యూటర్ అప్టిట్యూడ్ 25 మార్కులకు మొత్తం 125 ప్రశ్నలకు 125 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 

ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తికాగానే వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్​ లాంగ్వేజ్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. లెటర్ రైటింగ్, ఎస్సే ఉంటుంది. రెండు ప్రశ్నలకు 50 మార్కులు. సెక్షన్ల వారీగా క్వాలిఫై మార్కులు లేవు. ఎగ్జామ్ అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. 

స్క్రీనింగ్ టెస్ట్
ఆన్​లైన్ టెస్టులో క్వాలిఫై అయిన అభ్యర్థుల అప్లికేషన్, డాక్యుమెంట్లను స్కీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. జాబ్ ప్రొఫైల్​కు అనుగుణంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 

ఇంటర్వ్యూ
ఆన్​లైన్ టెస్ట్, స్క్రీనింగ్ పూర్తయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉద్యోగానికి ఎంపిక కావాలంటే ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాలి. క్వాలిఫై మార్కులను ఎస్​బీఐ నిర్ణయిస్తుంది. 

స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష
ఆన్​లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలను సమర్థవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. ఏ రాష్ట్రంలో జాబ్ కోసం అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర అధికార భాషలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంపై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే నియామక పత్రం ఇవ్వరు. పదోతరగతి, 12వ తరగతిలో స్థానిక భాషలో చదివిన వారికి స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. 

ప్రీ– ఎగ్జామినేషన్ ట్రైనింగ్
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎగ్జామ్​కు సంబంధించి ఉచిత శిక్షణ ఉంటుంది. దీనిని ఎస్​బీఐ ఆన్​లైన్ ద్వారా అందజేస్తుంది. ఉచితంగా శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ఆన్​లైన్ అప్లికేషన్​లో సంబంధిత కాలమ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉచిత శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ సమాచారం అభ్యర్థులకు ఈ–మెయిల్ ద్వారా తెలియజేస్తారు.