బిలియన్​ డాలర్లు సేకరించిన ఎస్​బీఐ

బిలియన్​ డాలర్లు సేకరించిన ఎస్​బీఐ

న్యూఢిల్లీ :  దేశీయ ఈఎస్​జీ ఫైనాన్సింగ్ మార్కెట్ కోసం బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) సేకరించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) బుధవారం తెలిపింది. సిండికేటెడ్ సోషల్ లోన్ ద్వారా  బిలియన్ డాలర్లు తీసుకున్నామని  (750 మిలియన్ డాలర్లు,   250 మిలియన్ల డాలర్ల గ్రీన్ షూ) ఎస్​బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. లోన్ బుక్​ను ఈ నెల రెండో తేదీన మూసివేశామని పేర్కొంది. 

గత సంవత్సరం కూడా ఎస్​బీఐ బిలియన్ డాలర్ల సిండికేటెడ్ సోషల్​ లోన్​ను సేకరించింది. ఈ ఫండ్ దేశీయ ఈఎస్​జీ (పర్యావరణ, సామాజిక, పాలన) ఫైనాన్సింగ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు ఉపయోగపడుతుంది. రెండు టెనార్ల (వ్యవధి) ద్వారా నిధులను సేకరించింది. ఒకటి మూడు సంవత్సరాలది కాగా, రెండోది  ఐదు సంవత్సరాల లోన్​.  సెప్టెంబర్ 30, 2023తో ముగిసిన రెండవ క్వార్టర్​లో బ్యాంక్ నికర లాభం 8 శాతం పెరిగి రూ.14,330 కోట్లకు చేరుకుంది.  బ్యాంకు నికర వడ్డీ ఆదాయం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 12.3 శాతం పెరిగి రూ.39,500 కోట్లకు చేరుకుంది.