
హైదరాబాద్, వెలుగు: ఎస్‌బీఐ ఇన్సూరెన్స్, తెలంగాణలో కొత్త బ్రాంచ్ ఆఫీస్ ప్రారంభించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దీనిని మొదలుపెట్టింది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నతాధికారులు అభిషేక్ మజుందార్, పి. వంశీధర్ రెడ్డి, రవీందర్ ఎప్పా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
“2047 నాటికి అందరికీ బీమా” కల్పించాలన్న భారత బీమా రంగ నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ) లక్ష్య సాధనకు ఈ వ్యూహాత్మక విస్తరణ తోడ్పడనుందని వీరు చెప్పారు.