అన్ని గ్రామాల్లో సివిల్​ రైట్స్​ డే నిర్వహించాలి : బక్కి వెంకటయ్య

అన్ని గ్రామాల్లో సివిల్​ రైట్స్​ డే నిర్వహించాలి : బక్కి వెంకటయ్య

కామారెడ్డి, వెలుగు:  జిల్లాలోని అన్ని గ్రామాల్లో  సివిల్​ రైట్స్​ డేని ప్రతీనెల నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్​చైర్మన్​ బక్కి వెంకటయ్య అన్నారు.   మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్​లో ఎస్సీ, ఎస్టీ కేసులపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లపై జరిగిన దాడుల కేసులు,  భూ సంబంధ కేసులు, సర్వీసు మ్యాటర్స్ పై  నెలలోపు   రిపోర్ట్​ పంపాలని  ఆదేశించారు.  పోలీస్​ స్టేషన్లలో నమోదైన పిటీషన్లను పరిశీలించాలన్నారు. 

అలాగే రెసిడెన్సియల్ స్కూల్స్, హాస్టల్స్​ను  తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో అంబేడ్కర్​ భవన నిర్మాణానికి చర్యలు తీసుకొవాలని కలెక్టర్​కు సూచించారు.   కమిషన్​ సభ్యులు  నీలబాయి,  లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్​ మాట్లాడారు.  ప్రతీ ఒకరు చదువుకుంటే చట్టాల గురించి తెలుసుకోవచ్చన్నారు.  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, ఎస్పీ సింధూశర్మ,  అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి,  ఆర్డీవోలు రంగనాథ్​రావు, ప్రభాకర్​, డీఎస్పీలు  నాగేశ్వర్​రావు, సత్యానారాయణ, శ్రీనివాసులు ,  ఆయా శాఖల ఆఫీసర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.