రివ్యూ పూర్తయ్యే వరకు దేశద్రోహ చట్టాన్ని ఆపేస్తరా?

రివ్యూ పూర్తయ్యే వరకు దేశద్రోహ చట్టాన్ని ఆపేస్తరా?

దేశద్రోహ చట్టంపై రివ్యూ పూర్తయ్యే వరకు ఆ చట్టాన్ని నిలిపివేస్తరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ చట్టం కింద ఇప్పటికే నమోదైన కేసులు, భవిష్యత్తులో నమోదు కాబోయే కేసుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగింది. వీటికి బుధవారంలోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఫైల్ అయిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. దేశద్రోహ చట్టాన్ని తిరిగి పరిశీలిస్తామని, అందుకు టైమ్ కావాలని కేంద్రం సోమవారం ఫైల్ చేసిన అఫిడవిట్​ను పరిశీలించింది. కేంద్రానికి ఎంత టైమ్ ఇవ్వాలో నిర్ణయించి చెప్తామని సీజేఐ తెలిపారు. దేశద్రోహ చట్టంపై రివ్యూ పూర్తయ్యేదాకా సెడిషన్ కేసులు పెట్టొద్దని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇవ్వొచ్చుగా అని జస్టిస్ హిమా కోహ్లీ సూచించారు.