
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లో 4జీ సేవలను కొనసాగించాలని ఆర్డర్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. 4జీ సేవలను కొనసాగించాలంటూ మీడియా ఫ్రొఫెషనల్స్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఐతే దేశ భద్రత దృష్ట్యా, పుకార్లు ప్రచారం కాకుండా ఉండేందుకు జమ్ము, కశ్మీర్ లో 4 జీ సేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్. వి రమణలో నేతృత్వంలో బెంచ్ పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలను పరిశీలించేందుకు మాత్రం హై పవర్ కమిటీ హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సూచించింది. మానవ హక్కులను కాపాడుతూనే, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్. వి రమణ కామెంట్ చేశారు. హై పవర్ కమిటీ సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.