జార్ఖండ్​ సీఎం సోరెన్కు సుప్రీంలో ఊరట

జార్ఖండ్​ సీఎం సోరెన్కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. సోరెన్ గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనకు తానే ఓ గని లీజు మంజూరు చేసుకున్నారని, ఇందులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై​ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. హేమంత్ సోరెన్​పై విచారణ జరపాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సీఎం హేమంత్​ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.