ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి : వడ్డేపల్లి రామచందర్

ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి  కృషి చేయాలి : వడ్డేపల్లి రామచందర్
  •     జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, లవ్ కుశ్ కుమార్

కాగ జ్ నగర్,వెలుగు: ఎస్సీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం,బాధ్యత ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, లవ్ కుశ్ కుమార్ అన్నారు. 

శనివారం కాగజ్ నగర్ లోని సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, హాస్టల్ లను  జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాలతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం, వసతి గృహసదుపాయాలు, విద్యా ప్రమాణాలపై అధికారులతో సమీక్షించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఎస్సీ విద్యార్థులకు విద్యాభివృద్ధికి ఉన్నత చదువులకు వెళ్లేలా సదుపాయాలు కల్పించి ప్రోత్సహించాలని సూచించారు.  అణగారిన వర్గాల సంక్షేమం కోసం కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. 

కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈడీ సురేష్ కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సత్యజిత్ మండల్ పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.