
మంచిర్యాల, వెలుగు: జైపూర్ మండలంలోని ఇందారం ఎక్స్ రోడ్ వద్ద కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహం ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ మెంబర్లు కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిసి వినతిపత్రం అందించారు.
ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీని నియమించాలని, శ్రీరాంపూర్ ప్రాంతంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ స్టడీ సెంటర్ తోపాటు ఇందారం ఎక్స్ రోడ్నుంచి గోదావరి బ్రిడ్జి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.