
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ లోని MLRIT కాలేజీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మేనేజ్ మెంట్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు ఇస్తామంటూ చాలా మంది నుంచి డొనేషన్లు తీసుకుంది కాలేజీ యాజమాన్యం. ఇప్పుడు సీట్లు లేవంటూ కాలేజీ యాజమాన్యం చేతులెత్తేసింది. తమకు సీట్లు ఇవ్వాలని.. వేరే కాలేజీల్లో సీట్లు అయిపోయాయని విద్యార్థులు, పేరేంట్స్ ఆందోళనకు దిగారు.
చాలా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతాయని కాలేజీ యాజమాన్యాలు డొనేషన్స్ తీసుకున్నాయి. రెండోసారి ప్రభుత్వం మేనేజ్ మెంట్ కోటా సీట్లు పెంచకపోవడంతో..డొనేషన్లను తిరిగితీసుకోవాలని పేరెంట్స్ ను వత్తిడి చేస్తున్నారు. అన్ని కాలేజీల్లో సీట్లు అయినపోయిన తర్వాత తమ పిల్లల పరిస్థితి ఏంటని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.