పింక్​వాట్సాప్​తో జర జాగ్రత్త!.. లింక్​పై క్లిక్​ చేస్తే కష్టాలు తప్పవు...

పింక్​వాట్సాప్​తో జర జాగ్రత్త!.. లింక్​పై క్లిక్​ చేస్తే కష్టాలు తప్పవు...

ముంబై: పింక్​ వాట్సాప్ ​పేరుతో  స్కామర్లు,  హ్యాకర్లు జనాన్ని మోసం చేస్తున్నట్టు వెల్లడయింది. ‘పింక్​ వాట్సాప్​’ అనే కొత్త మెసేజింగ్ ​యాప్​లో చాలా ఫీచర్లు ఉంటాయని, దీనిని డౌన్​లోడ్​ చేసుకోవాలంటూ నకిలీ లింక్స్​ పంపిస్తున్నారు. చాలా మందికి ఇలాంటి మెసేజ్​లు వచ్చాయి. ఇటీవల, ముంబై పోలీసులు 'పింక్ వాట్సాప్' మెసేజ్​కు సంబంధించి పబ్లిక్ అడ్వైజరీని విడుదల చేశారు.  ఈ లింక్​పై క్లిక్​ చేయవద్దని, పింక్​ వాట్సాప్​ అనేది నకిలీ యాప్​అని హెచ్చరించారు.  లింక్‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేయడం లేదా సంబంధిత అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయకూడదని స్పష్టం చేశారు. ‘‘పింక్​ వాట్సాప్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వార్తలు ఇటీవల వాట్సాప్‌‌లో హల్‌‌‌‌‌‌‌‌చల్ చేస్తున్నాయి. ఇది హానికరమైన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్.

దీని ద్వారా మీ మొబైల్‌‌‌‌‌‌‌‌ను హ్యాకింగ్ చేయడానికి నేరగాళ్లు  ప్రయత్నిస్తారు. ఇది కచ్చితంగా సైబర్ మోసమే! అమాయక జనం ట్రాప్‌‌‌‌‌‌‌‌లో పడేలా సైబర్​ నేరగాళ్లు వివిధ రకాల కొత్త మార్గాలను వాడుతున్నారు. వినియోగదారులు ఈ రకమైన మోసాల పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ ప్రపంచంలో సెక్యూరిటీ చాలా ముఖ్యం" అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.  మోసగాళ్లు పంపినది ఫిషింగ్ లింక్​ అని, దీనిపై క్లిక్​చేస్తే మొబైల్​ ఫోన్​ డేటా లీకయ్యే ప్రమాదం ఉందని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సంబంధిత మొబైల్​ను మోసగాళ్లు దూరం నుంచే కంట్రోల్​ చేయవచ్చు. కాంటాక్ట్ నంబర్స్​, సేవ్ చేసిన చిత్రాలకు అనధికారిక యాక్సెస్ పొందవచ్చు. ఆర్థిక నష్టాలు,  ఐడీ కార్డుల దుర్వినియోగం, స్పామ్ దాడులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పింక్ వాట్సాప్ స్కామ్ నుండి సురక్షితంగా ఉండటానికి, వాట్సాప్ వినియోగదారుల కోసం పోలీసులు అందించిన గైడ్​లైన్స్​ ఇలా ఉన్నాయి.

  •     మీరు నకిలీ యాప్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకునే ఉంటే ఫోన్​లో ‘ సెట్టింగ్‌‌‌‌‌‌‌‌లు > యాప్‌‌‌‌‌‌‌‌లు > వాట్సాప్’ (పింక్ లోగో)కి వెళ్లి అన్‌‌‌‌‌‌‌‌ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయాలి.
  •    లింకుల గురించి మీకు పూర్తిగా తెలిస్తే తప్ప వాటి జోలికి వెళ్లకూడదు. గుర్తు తెలియని సోర్సుల నుంచి వచ్చిన లింక్‌‌‌‌‌‌‌‌లపై క్లిక్ చేయకూడదని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.
  •   అధికారిక గూగుల్​ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్​ యాప్ స్టోర్ లేదా చట్టబద్ధమైన వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ల నుంచి మాత్రమే యాప్‌‌‌‌‌‌‌‌లను ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయండి లేదా అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయండి.
  •     సరైన అథంటికేషన్​ లేదా వెరిఫికేషన్​ లేకుండా ఇతరులకు ఏదైనా లింక్‌‌‌‌‌‌‌‌లు లేదా సందేశాలను ఫార్వర్డ్ చేయకండి.
  •     లాగిన్ ఐడీలు, పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు వంటి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఎవ్వరికీ ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. 
  •    మోసం ప్రయత్నాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తాజా వార్తలను,  అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌లను తెలుసుకోవాలి. ఫలితంగా సైబర్‌‌‌‌‌‌‌‌క్రిమినల్ కార్యకలాపాల గురించి సమాచారం  వస్తుంది. 

ఇలా కూడా మోసం చేస్తున్నరు

స్టాక్​ బ్రోకరింగ్​ప్లాట్​ఫారమ్​ జెరోదా ఫౌండర్​ నితిన్​ కామత్​  ఇటీవల ఓ మోసం గురించి ట్విట్టర్​ ద్వారా వివరించారు. ఈ స్కామ్​ ఎలా చేస్తారంటే.. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్ వంటి ఈ–కామర్స్​ సంస్థల నుంచి వస్తువులను ఆర్డర్​ చేసిన వారిని టార్గెట్​ చేస్తారు. తాము పోలీసులమని చెప్పుకుంటూ కస్టమర్​కు ఒక లెటర్​పంపిస్తారు. మీకు పంపిన పార్సిల్​లో డ్రగ్స్​  దొరికాయని, దీనిపై దర్యాప్తు మొదలయిందని చెబుతారు. మీరు మనీ లాండరింగ్​ చేస్తున్నారని బెదిరిస్తారు. విచారణ మొదలయిందని, వెంటనే రూ.22,525 లను తాము ఇచ్చిన బ్యాంకు అకౌంట్​కు డబ్బులు పంపించాలని సూచిస్తారు. విచారణ పూర్తయిన వెంటనే డబ్బులు వాపసు వస్తాయని నమ్మిస్తారు. ఇది మోసమని, దీని బారినపడకూడదని కామత్​ హెచ్చరించారు.