ఫేక్ అరెస్ట్ వారెంట్ పంపి 32 లక్షలు కొట్టేశారు

ఫేక్ అరెస్ట్ వారెంట్ పంపి 32 లక్షలు కొట్టేశారు
  • హైదరాబాద్ లో రిటైర్డ్ ఉద్యోగిని మోసగించిన స్కామర్లు

బషీర్​బాగ్, వెలుగు: ఫేక్​ అరెస్టు వారెంట్​ పంపించి  రిటైర్డ్​ ఉద్యోగి వద్ద స్కామర్స్​ రూ.32 లక్షలు కొట్టేశారు.  హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. తార్నాక పరిధి లాలాగూడ  ప్రాంతానికి చెందిన 83 ఏండ్ల  రిటైర్డ్  ఉద్యోగికి స్కామర్స్ గత నెల 23న ఫోన్ కాల్ చేశారు. ఆయన వివరాలు తీసుకుని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ పేరిట నకిలీ అరెస్ట్ వారెంట్ పంపించారు.

మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఈడీ , పోలీస్ అధికారులుగా నమ్మిస్తూ భయపెట్టారు. ఆయనతో పాటు భార్యను అరెస్ట్ చేసి ముంబైకు తీసుకెళ్తామని హెచ్చరించారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీంతో అతను పలు దఫాలుగా రూ.32 లక్షలు పంపించాడు. ఆ తర్వాత మోసపోయినట్లు తెలుసుకుని  సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.