హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇండ్లలో ఉపయోగం లేకుండా ఉన్న పాత పరుపులు, విరిగిపోయిన మంచాలు, సోఫాలు, కుర్చీలు, అల్మారాలు, టేబుళ్లు, ఇతర ఫర్నిచర్‌ను ఉచితంగా ఇంటి వద్ద నుంచే సేకరించే 'ఫ్రీ డోర్‌స్టెప్ పికప్' సేవలను GHMC అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ వ్యర్థాలను కొందరు రోడ్లపై, ఖాళీ స్థలాల్లో లేదా నాలాల్లో పడేస్తుండడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ సేవలను ప్రారంభించింది. ఎవరైనా ఈ సేవలను పొందాలనుకుంటే జీహెచ్ఎంసీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా సర్వీస్ కవరేజ్ మ్యాప్‌ను పరిశీలించి ఉచిత డోర్‌స్టెప్ పికప్‌ను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది.
