
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ‘భ్రమయుగం’ అనే హారర్ మూవీతో థ్రిల్ చేయబోతున్నారు. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దీనికి దర్శకుడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈనెల 15న సినిమా విడుదల కానుంది.
మొదటి నుంచి బ్లాక్ అండ్ వైట్ పోస్టర్స్‌తో ఆకట్టుకున్న మేకర్స్, సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉండబోతోందని రివీల్ చేశారు. ఒకప్పడు బ్లాక్ అండ్ వైట్‌లోనే మొదలైన సినిమాలు ఇప్పుడు కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి టైమ్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా చేయడం, అదికూడా హారర్ సినిమా తీయడం ఆసక్తి రేపుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.