చెన్నూర్ ఎస్బీఐలో సీన్ రీకన్స్ట్రక్షన్

చెన్నూర్ ఎస్బీఐలో సీన్ రీకన్స్ట్రక్షన్

  చెన్నూర్, వెలుగు: చెన్నూర్ ఎస్బీఐ–2లో బ్యాంక్ అధికారులే 20 కిలోల 200 గ్రాముల బంగారం, రూ.1.16 లక్షలను కాజేయగా.. నిందితులను అరెస్ట్​చేసి, సొత్తు రికవరీ చేసిన విషయం తెలిసిందే. 

గురువారం జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మేనేజర్ మనోహర్ రెడ్డి, క్యాషియర్ రవీందర్, తాత్కాలిక ఉద్యోగి సందీప్ ను బ్యాంక్​కు తీసుకెళ్లి సీన్ రీకన్​స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మొత్తం 44 మందిని అరెస్ట్​చేశామని ఏసీపీ పేర్కొన్నారు.