స్కీమ్ లు ప్రజలకు..అందేలా పనిచేయాలి : అధికారులకు సీతక్క ఆదేశం

స్కీమ్ లు ప్రజలకు..అందేలా పనిచేయాలి : అధికారులకు సీతక్క ఆదేశం
  • పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ పై మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు :  పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖలు నిత్యం ప్రజలతో మమేకమయ్యి ఉంటాయని ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క అన్నారు. ప్రభుత్వ స్కీమ్ లు ప్రజలకు అందేలా అధికారులు పని చేయాలని తెలిపారు. అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని చెప్పారు. సోమవారం రాజేంద్రనగర్ లో టీఎస్ఐఆర్ డీలో పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు.

ఉపాధి హామీ స్కీమ్, స్వచ్ఛ భారత్, కేంద్ర, రాష్ర్ట ఆర్థిక సంఘాలు, స్థానిక సంస్థల్లో శానిటేషన్, మహిళ సంఘాలకు రుణాలు, ఆసరా పెన్షన్లు,  పంచాయతీ రాజ్ రోడ్ల డిపార్ట్​మెంట్​లో అమలవుతున్న స్కీమ్​లను​ అధికారులు మంత్రికి వివరించారు. ఈ మీటింగ్ లో పంచాయతీరాజ్  ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా,  పీఆర్ ఈఎన్సీ సంజీవ రావు,  పలువురు డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.