టీచర్లకు సెలవులివ్వొద్దు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన

టీచర్లకు సెలవులివ్వొద్దు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన
  • హైదరాబాద్​కు వచ్చి ఆందోళనలు చేస్తున్నరు..
  • డీఈవోల మీటింగ్​లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ టీచర్లకు ఈ టైమ్​లో సెలవులు ఇవ్వొద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఆందోళనలు, ధర్నాలు చేసేందుకు హైదరాబాద్ వస్తున్నారని, వారిని అక్కడే ఆపాలని సూచించారు. అయితే హెడ్​మాస్టర్లు సెలవులు ఇస్తున్నారనీ డీఈవోలు చెప్పడంతో.. వారికి ఈ విషయం చెప్పాలని ఆదేశించారు. సోమవారం ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో ఆర్​జేడీలు, డీఈవోలతో స్కూల్ఎడ్యుకేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 11గంటలకు సమావేశం ఉందని షెడ్యూల్ ఇచ్చినా.. మధ్యాహ్నం వరకు డైరెక్టర్ గానీ, ఇతర ఉన్నతాధికారులు గానీ అక్కడికి రాలేదు. దీంతో కొందరు డీఈవోలు ఫోన్లు చేస్తే.. సెక్రటేరియెట్​లో పనిలో ఉన్నట్టు చెప్పారు. చివరికి మధ్యాహ్నం 3కు సమావేశానికి వచ్చారు. సమావేశం సాయంత్రం 7 వరకూ సాగింది.