
- స్కూల్ ఎడ్యుకేషన్డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో రీసెర్చ్ల బలోపేతానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం మ్యాథ్స్, సైన్స్ ల్యాబ్ మాన్యువల్స్ పంపిణీ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు.
గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, టీఆర్ఐఈఎస్, యూఆర్ఎస్ పరిధిలోని బడుల్లో వీటిని అందుబాటులో పెట్టాలని డీఈవోలకు తాజాగా ఆదేశాలిచ్చారు. ఇవి లెస్సన్ ప్లాన్‌కు అనుగుణంగా వీటిని రూపొందించారు. క్లాసుల్లో ప్రాక్టికల్స్ సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు మాన్యువల్స్ ఉపయోగపడతామని అధికారులు చెప్తున్నారు.
అయితే, సైన్స్ ల్యాబ్ మాన్యువల్స్ (జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్) ప్రింటింగ్ పూర్తవగా, జిల్లాల టెక్ట్స్ బుక్స్గోడౌన్లకు పంపిణీ ప్రారంభమైంది. మ్యాథ్స్ ల్యాబ్ మాన్యువల్స్ ప్రింటింగ్ ఇంకా కొనసాగుతుండగా, త్వరలో ప్రక్రియ పూర్తికానున్నది. ఇవి ఇంగ్లిష్ మీడియంలో తయారు చేశారు. ఒక్కో స్కూల్‌కు ప్రతి ల్యాబ్ మాన్యువల్‌ను క్లాసుకు రెండు చొప్పున పంపిణీ చేయనున్నారు.
హైస్కూళ్లకు మొత్తం 16 సైన్స్ ల్యాబ్ మాన్యువల్స్, 10 మ్యాథ్స్ ల్యాబ్ మాన్యువల్స్ అందించనున్నారు. యూపీఎస్ స్కూళ్లకు 4 జనరల్ సైన్స్ మాన్యువల్స్, 4 మ్యాథ్స్ మాన్యువల్స్ పంపిణీ చేయనునున్నారు. వీటిని టీచర్లకు వ్యక్తిగతం కుండా స్కూళ్లలోని పిల్లల కోసం వినియోగించాలని అధికారులు ఆదేశించారు. మాన్యువల్స్‌ను కేవలం నోట్స్ రాసుకోవడానికి కాకుండా, ప్రాక్టికల్ అనుభవం కోసం ఉపయోగించాలని సూచించారు.