నర్సంపేట మండలంలో 14 ఏళ్ల కింద మూతపడ్డ స్కూల్ రీఓపెన్

నర్సంపేట మండలంలో 14 ఏళ్ల కింద మూతపడ్డ స్కూల్ రీఓపెన్
  • బొజ్య నాయక్ తండాను ఆదర్శ గ్రామంగా  తీర్చిదాద్దాలి 
  • వరంగల్​ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట , వెలుగు: నర్సంపేట మండలంలోని బొజ్యనాయక్ తండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్​జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కోరారు. 14  ఏళ్ల క్రితం మూతపడ్డ ప్రభుత్వ ఎంపీపీ పాఠశాలను గురువారం కలెక్టర్ పున:ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. బొజ్యనాయక్​తండా  పాఠశాల పునః ప్రారంభానికి కృషి చేసిన బొజ్య నాయక్ తండా వారియర్స్ యువకులు, తండావాసులను అభినందిస్తున్నట్లు చెప్పారు.

 గంగాదేవి పల్లి, మరియాపురం గ్రామాలతో పోటీపడి బొజ్య నాయక్ తండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. దాసరి నర్సింహారెడ్డి అందించిన బ్యాగులు, నోటు బుక్స్, పెన్సిళ్లను విద్యార్థులకు కలెక్టర్​ అందజేశారు. డీఈఓ జ్ఞానేశ్వర్, బీఎన్​ తండా వారియర్స్ కమిటీ జనరల్ సెక్రటరీ సాగర్​, డీఎస్పీ నారాయణ, అసోసియేట్​ప్రెసిడెంట్​భూక్య వీరన్న, ఉపాధ్యక్షుడుసూరయ్య తదితరులు పాల్గొన్నారు.