
- ప్రజా ప్రభుత్వం అడగ్గానే టీచర్లకు పదోన్నతులు కల్పించింది
- సీఎంకు థాంక్స్ చెప్పిన ఎస్టీఎఫ్
బషీర్‌బాగ్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఉండేది కాదని, పోలీసులతో ఉద్యోగ, ఉపాధ్యాయులను భయపెట్టేవారని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్టీఎఫ్) అధ్యక్షుడు దేవరకొండ సైదులు అన్నారు. ఇప్పటి ప్రజాప్రభుత్వంలో నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం కలుగుతోందన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయన్నారు.
ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్లను రేవంత్ సర్కార్ నెరవేర్చడంపై సంతోషం వ్యక్తం చేశారు. నగదు రహిత వైద్య పథకానికి సంబంధించిన చర్యలను కూడా చేపట్టాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ను వెంటనే అందించాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. టీచర్లకు పదోన్నతులు కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు థాంక్స్ చెప్పారు.