మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. యూనిఫామ్ కుడితే 50 కాదు 70 రూపాయలు

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. యూనిఫామ్ కుడితే 50 కాదు 70 రూపాయలు

తెలంగాణలో జూన్ 12న ప్రభుత్వ స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది సర్కార్. అందులో భాగంగా జూన్ 12లోగా స్కూళ్ల మరమ్మతులు పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. 

ఇక ఇప్పటికే స్కూల్ టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్స్ పాఠశాలలకు చేరుకుంటున్నాయి. ఇక యూనిఫామ్ స్ట్రిచ్చింగ్ చార్జ్   50రూపాయల నుంచి 75వరకు పెంచుతూ జీవో జారీ చేసింది సర్కార్. ఇక జూన్ 12న జరగనున్న స్కూళ్ల రీ ఓపెనింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి  పాల్గొననున్నారు. అందులో భాగంగా  విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అందించనున్నారు సీఎం రేవంత్, మంత్రులు.