ఉడుపిలో స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

ఉడుపిలో స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

కర్ణాటకలోని ఉడుపిలో స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ చేశారు అధికారులు. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పు తర్వాత స్కూళ్లు, కాలేజ్ లు తెరిచారు. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన వివిధ పిటిషన్లను కొట్టివేసింది కర్ణాటక హైకోర్టు. దీంతో ఉడుపిలో స్కూళ్లు, కాలేజ్ లు తిరిగి ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు బ్యాన్ చేశారు అధికారులు.

ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.  పలు స్కూళ్లు,కాలేజీలను పరిశీలించారు డిప్యూటీ కమిషనర్ ఎం.కూర్మారావు. తరగతులు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని..విద్యార్థుల తల్లిదండ్రులు తమకు సహకరించాలని కోరారు. ఉడుపిలో మొదలైని హిజాబ్  వివాదం.... కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలకు కారణమైంది. దీంతో కొన్ని రోజుల పాటు స్కూళ్లు, కాలేజ్ లు మూసివేశారు.

మరిన్ని వార్తల కోసం

 

రాజస్థాన్ లో భానుడి భగ..భగలు 

వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం