ఇంగ్లండ్‌లో ప్రారంభమైన స్కూళ్లు, కాలేజీలు

ఇంగ్లండ్‌లో ప్రారంభమైన స్కూళ్లు, కాలేజీలు

ఇంగ్లండ్ లో  అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. ఇవాళ్టి(మంగళవారం,సెప్టెంబర్ -1) నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. మార్చి నెల‌లో విధించిన లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థ‌లన్నీ బంద్ అయ్యాయి. నియంత్రిత ప‌ద్ధ‌తిలో స్కూళ్ల‌ను తెర‌వ‌నున్న‌ట్లు ఆ దేశ విద్యాశాఖ ప్రకటించింది. పిల్ల‌లు, టీచ‌ర్లు, సిబ్బంది మ‌ధ్య డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా ఉండేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సోష‌ల్ డిస్టాన్స్ ను కూడా అమ‌లు చేయ‌నున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ప్రాంతాల్లో ఫేస్ మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి. కొత్త విద్యా సంవ‌త్స‌రం మంగళవారం నుంచి ప్రారంభం అయినట్లు బ్రిట‌న్ విద్యాశాఖ మంత్రి గెవిన్ విలియ‌మ్‌స‌న్ తెలిపారు. ఫుల్ టైమ్ ఎడ్యుకేష‌న్ కోసం స్కూళ్ ల‌ను రీఓపెన్ చేసినట్లు  చెప్పారు.