సెలవులు ప్రకటించినా పెద్దపల్లిలో స్కూల్స్ ఓపెన్

సెలవులు ప్రకటించినా పెద్దపల్లిలో  స్కూల్స్ ఓపెన్

పెద్దపల్లి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు పాఠశాలలు రన్ చేస్తున్నారు. ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినా.. రామగిరి మండలం సెంటనరీ కాలనీ లో స్కూల్ ను రన్ చేస్తున్నారు. ఎంఈవో అధికారులు స్కూల్ లోకి రాగానే గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను పంపించారు. దసరా సెలవుల్లో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ రన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ప్రకటించింది.