హైదరాబాద్, వెలుగు: సైయెంట్ లిమిటెడ్ 2022–23 ఫైనాన్షియల్ ఇయర్‌కు షేర్ ఒక్కింటికి రూ. 16 చొప్పున ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. ఫేస్ వాల్యూ రూ. 5 గా ఉన్న షేర్‌పై ఈ డివిడెండ్ 320 శాతానికి సమానమవుతుంది. గత 12 నెలల్లో సైయెంట్ షేరుకి రూ. 24 చొప్పున డివిడెండ్ డిక్లేర్ చేసింది. మార్చి 2023 క్వార్టర్లో సైయెంట్ నికర లాభం 6 శాతం పెరిగి రూ. 163 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూసినా నికర లాభం 4 శాతం ఎక్కువైంది.
మార్చి 2023 క్వార్టర్లో సైయెంట్ రెవెన్యూ రూ. 1,751 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ 4 లో కంపెనీ రెవెన్యూ రూ. 1,181 కోట్లు మాత్రమే. ఇక 2023–24 లో రెవెన్యూ పెరుగుదల 15–20 శాతం దాకా ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. తమ సబ్సిడరీ కంపెనీ ఒకదానిపై యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో సివిల్ క్లాస్ యాక్షన్ యాంటి ట్రస్ట్ కేసు ఒకటి దాఖలైనట్లు సైయెంట్ తెలిపింది. ఈ కేసు కోసం యూఎస్ సబ్సిడరీ రూ. 16.20 కోట్లను లీగల్ ఖర్చులుగా వెచ్చించాల్సి వచ్చిందని పేర్కొంది. రిజల్ట్స్ నేపథ్యంలో గురువారం సెషన్లో సైయెంట్ షేర్లు 2.02 శాతం పెరిగి రూ. 1,091.45 వద్ద క్లోజయ్యాయి.
