అనంత‌పురం జిల్లాలో అరుదైన ఖ‌నిజ నిక్షేపాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

అనంత‌పురం జిల్లాలో అరుదైన ఖ‌నిజ నిక్షేపాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్సిస్ట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు అరుదైన ఖనిజాలను (మూలకాలను) కనుగొన్నారు. అది కూడా ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం నగరంలో. ఈ ప్రాంతంలో పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు దాదాపు 15రకాల విశిష్ట ఖనిజాల ( లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ -REE) ఉనికిని  గుర్తించారు. 

అనంతపురం జిల్లాలో 15 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (REE)కి చెందిన భారీ నిక్షేపాలను కనుగొన్న శాస్త్రవేత్తలు ఇవి అనేక రంగాలలో అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ ,శాశ్వత అయస్కాంతాల తయారీతోపాటు, ఆధునిక ఎలక్ట్రానిక్స్‌లో కీలక భాగమైన విండ్ టర్బైన్లు, జెట్‌ ఎయిర్ క్రాఫ్ట్ వంటి అనే రంగాలలో వీటిని ఉపయోగిస్తారని చెబుతున్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని దంచర్ల, పెద్దవడుగూరు, దండువారిపల్లి, రెడ్డిపల్లి చింతల్ చెరువు, పులికొండ కాంప్లెక్స్ ఈ ఖనిజాలకు కేంద్రాలుగా ఉన్నాయని, ఈ ఖనిజ నిక్షేపాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.