అకస్మాత్తుగా మంటలు.. స్కార్పియో వాహనం దగ్ధం

అకస్మాత్తుగా మంటలు.. స్కార్పియో వాహనం దగ్ధం

అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ స్కార్పియో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందగి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కొద్దిసేపటికే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుంటే, దేశంలో ఎండలు భగభగా మండిపోతున్నాయి. ఈ సమయంలో కార్లలో ప్రయాణించే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి.  ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన సమయంలో వాహనాన్ని కాసేపు ఆపి మరలా ప్రయాణించండి. అలాగే ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేసి ఉంచకండి. వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.