మెదక్, వెలుగు: జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే సందర్భంగా శుక్రవారం మెదక్ పట్టణంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. డీఈవో రాధాకిషన్, మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకులాల ఆర్సీవో రాజేశం, డీఎస్ వో రాజిరెడ్డి పాల్గొన్నారు.
బీసీ గురుకుల పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు క్యాంపింగ్ టెస్ట్ నిర్వహించారు. విద్యార్థులు వేసిన గుడారాలను పరిశీలించి స్కౌట్స్ గైడ్స్ శిక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అడిషనల్ ఎస్పీ మహేందర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రధానం చేశారు. కార్యక్రమంలో రేంజర్స్ కమిషనర్ శ్రీజన, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ రాజేందర్ డిస్టెక్ట్ లు, నాగరాజు, జ్యోత్స డీటీవో మహిపాల్, స్కౌట్స్ మాస్టర్స్ గైడ్ మాస్టర్స్, లైబ్రేరియన్ సంతోష్ పాల్గొన్నారు.
