4 ఐపీఓలకు సెబీ గ్రీన్​ సిగ్నల్

4 ఐపీఓలకు సెబీ గ్రీన్​ సిగ్నల్

4 ఐపీఓలకు సెబీ గ్రీన్​ సిగ్నల్

హైదరాబాద్​ కంపెనీ సైయంట్​ డీఎల్​ఎం, హెల్త్​విస్టా, జాగిల్​, రాశి పెరిఫెరల్స్​

న్యూఢిల్లీ : సైయంట్​డీఎల్​ఎం, రాశి పెరిఫెరల్స్, హెల్త్​ విస్తా, జాగిల్​ ప్రీపెయిడ్​ ఓషన్​ సర్వీసెస్​ కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. జులై 2022–జనవరి 2023 మధ్య కాలంలో ఈ కంపెనీలు ఐపీఓల కోసం పేపర్లు ఫైల్​ చేసుకున్నాయి. ఐటీ సొల్యూషన్స్​ కంపెనీ రాశి పెరిఫెరల్స్​ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 750 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ఈ డబ్బులో రూ. 400 కోట్లు అప్పులు తీర్చడానికి, రూ. 200 కోట్లు వర్కింగ్​ క్యాపిటల్​ కోసం వాడుకోవాలనేది రాశి పెరిఫెరల్స్​ ప్లాన్​. ఎలక్ట్రానిక్​ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్​​ రంగంలోని హైదరాబాద్ కంపెనీ సైయంట్​ డీఎల్​ఎం తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 740 కోట్లు సేకరించాలని ఆలోచిస్తోంది. ఇందులో ఆఫర్​ ఫర్​ సేల్​ లేదు.

క్యాపెక్స్​, ఎక్విజిషన్లు, అప్పులు తీర్చడానికి ఈ నిధులు వెచ్చించాలని కంపెనీ ప్లాన్​ చేస్తోంది. పోర్టియా బ్రాండ్​ పేరుతో అవుటాఫ్​ హాస్పిటల్​ హెల్త్​కేర్​ అందిస్తున్న హెల్త్​విస్టా ఇండియా కూడా రూ. 200 కోట్ల సమీకరణ కోసం తాజా షేర్లను జారీ చేయాలనుకుంటోంది. దీంతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లలో కొంత మంది 5.62 కోట్ల షేర్లను ఆఫర్​ ఫర్​ సేల్​ కింద ఉంచనున్నారు. ఈ కంపెనీ ఐపీఓ విలువ రూ. 1,000 కోట్ల దాకా ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఓ ఫండ్స్​ను సబ్సిడరీ కంపెనీ మెడిబిజ్​ పార్మా వర్కింగ్​ క్యాపిటల్​ అవసరాల కోసం కంపెనీ వాడాలనుకుంటోంది.