
న్యూఢిల్లీ: మహిళలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని పెంచేందుకు సెబీ చర్యలు తీసుకోనుంది. తొలిసారిగా ఇన్వెస్ట్ చేసే మహిళలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. 30 టైర్ 2, 3 సిటీల్లోని కొత్త పెట్టుబడిదారులకు, ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తామని అన్నారు.
మ్యూచువల్ ఫండ్ స్కీముల వర్గీకరణను మళ్లీ పరిశీలించి పారదర్శకత పెంచే చర్యలు తీసుకుంటామని అన్నారు. సెబీ ఇటీవల 52 రిపోర్టులు, నోటీసులు, అదనపు ఫైలింగ్ అవసరాన్ని తొలగించింది. రాబోయే నెలల్లో మ్యూచువల్ ఫండ్ నిబంధనలను మరింత సరళతరం చేయనుంది.