- వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అర్హత ఉన్న స్టాక్ బ్రోకర్లు యూపీఐ బేస్డ్ బ్లాక్ మెకానిజంతో ట్రేడ్ చేసుకునే వెసులుబాటును తమ క్లయింట్లకు కల్పించాలని సెబీ ఆదేశించింది. అంటే ఇన్వెస్టర్ల ఫండ్స్ వారి బ్యాంక్ అకౌంట్లలోనే ఉంటాయి. షేర్లను కొనుగోలు చేసేటప్పుడు అమౌంట్ బ్లాక్ అవుతుంది. షేర్లు కొనడం పూర్తయ్యాక అమౌంట్ డెబిట్ అవుతుంది. స్టాక్ బ్రోకింగ్ యాప్‌లలోకి ఫండ్స్‌ను యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం ఐపీఓ టైమ్‌లో వాడుతున్న అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఏఎస్‌బీఏ) మాదిరే ఇది కూడా పనిచేస్తుంది. ఈ సౌకర్యాన్ని లేదా 3 ఇన్ 1 ట్రేడింగ్ అకౌంట్ సౌకర్యం..ఏదో ఒకటి స్టాక్ బ్రోకర్లు కచ్చితంగా కల్పించాలి. 3 ఇన్ 1 అకౌంట్‌లో సేవింగ్స్ అకౌంట్, డీమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మూడు కలిసి ఉంటాయి. ఈ అకౌంట్ వాడే ఇన్వెస్టర్ల ఫండ్స్ మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేంతవరకు వారి సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంటాయి. వీటిపై వడ్డీ పొందొచ్చు.