
న్యూఢిల్లీ: మన క్యాపిటల్ మార్కెట్లో మరింత ట్రాన్స్పరెన్సీ తెచ్చేందుకు వీలుగా ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)ల డిస్క్లోజర్ రూల్స్‌ను మార్చాలని సెబీ ప్రపోజ్ చేస్తోంది. ఒకే కంపెనీ లేదా గ్రూప్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే హై–రిస్క్ ఎఫ్‌పీఐలు మరిన్ని వివరాలను ఇచ్చేలా రూల్స్ మార్చాలనుకుంటోంది సెబీ.
దేశీయ కంపెనీల టేకోవర్‌కు ఎఫ్‌పీఐ రూట్‌ను వాడుకోకుండా చూడాలనేది కూడా సెబీ ఉద్దేశాలలో ఒకటి. అదానీ గ్రూప్ షేర్లలో కొన్ని ఎఫ్‌పీఐలు షార్ట్ సెల్లింగ్‌కు పాల్పడినా, బెనిఫిషియల్ ఓనర్లెవరో సెబీ తెలుసుకోలేకపోయింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఇది కుదరలేదు.