కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

నాలుగో క్వార్టర్‌‌ రిజల్ట్స్‌‌ ప్రకటనకు 45 రోజుల గడువు పెంచారు. అంతేకాదు, కార్పొరేట్‌‌ గవర్నెన్స్‌‌ రిపోర్టు ఫైలింగ్‌‌కూ నెల రోజులు గడువు పొడిగించారు. కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలోని లిస్టెడ్‌‌ కంపెనీలకు వెసులుబాటు కల్పించేందుకే ఈ చొరవ తీసుకున్నారు. ఇక షేర్‌‌హోల్డింగ్‌‌ పాటర్న్‌‌ ఫైలింగ్‌‌కు, ఇన్వెస్టర్‌‌ కంప్లెయింట్స్‌‌ రిపోర్ట్స్‌‌ ఫైలింగ్‌‌కూ  మూడు వారాలు గడువు పెంచినట్లు సెబీ తెలిపింది. మహమ్మారి కరోనా వైరస్‌‌ నానాటికీ విస్తరిస్తుండటంతో  కంపెనీల ఆపరేషన్స్‌‌పై ఆ ప్రభావం పడుతోందని సెబీ పేర్కొంది. అందుకే గడువు పొడిగింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించింది.  కంపెనీలకు రిలీఫ్‌‌ కోసమే తాత్కాలికంగా గడువు పొడిగిస్తున్నట్లు సెబీ తెలిపింది.