Adani News: అదానీ ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్.. పెద్ద స్కామ్ దాస్తున్నారా..!!

Adani News: అదానీ ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్.. పెద్ద స్కామ్ దాస్తున్నారా..!!

SEBI On Adani: చాలా కాలం తర్వాత మరోసారి అదానీ గ్రూప్ పేరు వార్తల్లో వినిపిస్తోంది. హిండెన్ బర్గ్ ఆరోపణలు, పవర్ డీల్స్ ఆరోపణల తర్వాత తాజాగా అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై మరోసారి మార్కెట్లో పెద్ద దుమారం కొనసాగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం దీనిపై కీలక కామెంట్స్ చేయటం గమనార్హం.

వివరాల్లోకి వెళితే మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ అదానీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన రెండు మారిషస్ ఆధారిత ఫండ్స్ కి కీలక వార్నింగ్ ఇచ్చింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలను పంచుకోవాలని రెండేళ్లుగా అడుగుతున్నప్పటికీ స్పందించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వివరాలు ఇవ్వకపోతే భారీ జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. సెబీ దూకుడు చర్యలతో ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, వెస్పెరా ఫండ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.

ALSO READ | Sensex Crash: భయంలో బుల్స్.. జోరుమీదున్న బేర్స్, ఇన్వెస్టర్లను ముంచిన కారణాలివే..

ఈ వివరాలను ఫండ్స్ అందించకపోవటం కారణంగా అదానీ గ్రూప్ కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలను పాటించడంపై దర్యాప్తును అడ్డుపడుతున్నాయని సెబీ పేర్కొంది. వాస్తవానికి భారతీయ పెట్టుబడి రూల్స్ ప్రకారం ఏదైనా లిస్టెడ్ కంపెనీలో కనీసం 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలి. కానీ అదానీ గ్రూప్ కంపెనీల విషయంలో ఇది సరిగ్గా ఉందా లేదా అనే విషయాలను తెలుసుకోవటానికి విదేశీ ఫండ్స్ సహకరించకపోవటం ప్రస్తుతం దుమారానికి కారణంగా తెలుస్తోంది.

 

అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఎక్స్ ఖాతాలో కీలక పోస్ట్ చేశారు. పైన పేర్కొన్న రెండు ఫండ్స్ స్టాక్ పార్కింగ్ వివాదంలో ఉన్నాయని.. అవి అదానీ సొంత కంపెనీల్లో బినామీ పెట్టుబడులకు ఇవి వేదికగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. పైగా ఈ ఫండ్స్ నేరాన్ని అంగీకరించకుండా నామమాత్రపు రుసుము చెల్లించటానికే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాటానికి ముందుకొచ్చాయని తెలుస్తోందని ఆయన అన్నారు. ఇది మోదీ అదానీకి అత్యంత అనుకూలమైన చర్యగా జైరామ్ రమేష్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అదానీ విషయంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని దాచేంచుకు ప్రయత్నిస్తోందని కూడా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.