కేరళలో మంకీపాక్స్ రెండో ​కేసు

కేరళలో మంకీపాక్స్ రెండో ​కేసు

న్యూఢిల్లీ: దేశంలో సోమవారం మంకీపాక్స్ రెండో​కేసు వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి (31)  కి మంకీపాక్స్​ పాజిటివ్​గా తేలిందని అధికారులు తెలిపారు. కన్నూర్కు  చెందిన ఇతను ఈ నెల 13న దుబాయ్  నుంచి మంగళూరు ఎయిర్ పోర్టులో దిగాడని వారు తెలిపారు. ‘‘ఆ వ్యక్తిలో మంకీపాక్స్ ​సింప్టమ్స్​ను గుర్తించిన వెంటనే హాస్పిటల్​లో అడ్మిట్ చేశాం. అతని సాంపుల్స్​ను పుణెలోని నేషనల్ ​ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ​ వైరాలజీ(ఎన్​ఐవీ) కి పంపాం. ఆ సాంపుల్స్​ను పరీక్షించగా మంకీపాక్స్​ పాజిటివ్​గా  తేలింది. ప్రస్తుతం పేషెంట్ ​కన్నూర్​లోని పరియరమ్​ మెడికల్​కాలేజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని పరిస్థితి స్టేబుల్​గా ఉంది” అని హెల్త్​ డిపార్ట్​మెంట్​ అధికారులు తెలిపారు. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరపాలని అన్ని ఎయిర్​పోర్ట్​, పోర్ట్ అధికారులకు  కేంద్ర ప్రభుత్వం సూచించింది. కిందటి వారం యూఏఈ నుంచి కేరళకు తిరిగివచ్చిన వ్యక్తికి కూడా మంకీపాక్స్​ పాజిటివ్​గా తేలింది. ఆ టైమ్​లో  కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా నేషనల్​ సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్(ఎన్​సీడీసీ) నుంచి నిపుణులను కేరళకు పంపింది. వెస్ట్​, సెంట్రల్​ ఆఫ్రికాలో మే నెలలో మంకీపాక్స్​ ఇన్​ఫెక్షన్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇది అక్కడ ఎండెమిక్ గా  ఉంది.