
గచ్చిబౌలి, వెలుగు : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు గురువారం రెండోరోజూ ఆందోళన కొనసాగించారు. ‘వీ ఆర్ విత్ సీబీఎన్’ అంటూ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
చంద్రబాబుకు మద్దతుగా బుధవారం హైటెక్ సిటీ పరిధిలో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో గురువారం ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాయంత్రం వేళ కూడా పలువురు ఐటీ ఉద్యోగులు, ఇతరులు సైబర్ టవర్స్ వద్ద ఆందోళనకు దిగేందుకు రాగా.. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.