
రాజ్‌గఢ్: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మే నెలలో చనిపోయిన ఓ వ్యక్తి ఫోన్‌కు డిసెంబర్లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ పూర్తయినట్లు మెసేజ్వచ్చింది. అది చూసి షాక్ తిన్న కుటుంబ సభ్యులు ఆఫీసర్ల దగ్గరకు పోతే.. కంప్యూటర్ తప్పిదం వల్ల వచ్చి ఉంటుందని తేల్చేశారు. రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన పురుషోత్తం శక్యవార్(78) ఏప్రిల్8న కరోనా ఫస్ట్‌డోస్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్ల అతను మే 24న చనిపోయాడు. ఆయనచనిపోయిన దాదాపు ఆరు నెలల తర్వాత డిసెంబర్3న సెకండ్ డోస్ వ్యాక్సిన్ పూర్తయింది అని శక్యవార్ ఫోన్‌కు మెసేజ్వచ్చింది. అది చూసిన కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ సర్టిఫికెట్డౌన్లోడ్ చేయగా.. పురుషోత్తం శక్యవార్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఉంది. ఈ విషయమై కుటుంబ సభ్యులు వివరణ కోరగా.. కంప్యూటర్ ఎర్రర్ కారణంగా ఫోన్ నెంబర్ తప్పు పడి మెసేజ్వచ్చి ఉంటుందని అధికారులు చెప్పారు. దానిపై విచారిస్తున్నట్లు జిల్లా వ్యాక్సినేషన్ ఆఫీసర్ పీఎల్భగోరియా తెలిపారు.