విశాఖపట్నంలో హెచ్ఆర్సీఐ ద్వితీయ సభ

విశాఖపట్నంలో హెచ్ఆర్సీఐ ద్వితీయ సభ

మంచిర్యాల, వెలుగు: ఈ నెల 25న విశాఖపట్నంలోని సింహాచలం ఎస్ఆర్ కల్యాణ మండపంలో హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా(హెచ్ఆర్సీఐ) ద్వితీయ వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ శాఖ అధ్యక్షుడు బేతి తిరుమల్ రావు, సీఆర్ఓ రాజేశం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. ఈ సభకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల ప్రతినిధులు, జాతీయ లీడర్లు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సభలో మానవ హక్కులపై అవగాహన కల్పిస్తారని.. మేధావులు, యువకులు, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.