నల్గొండ జిల్లాలో రెండో విడత నామినేషన్లు స్టార్ట్

నల్గొండ జిల్లాలో  రెండో విడత నామినేషన్లు స్టార్ట్

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఆదివారం ప్రారంభమైంది. సెలవు రోజు కావడంతో పెద్దగా సందడి లేదు. కొన్ని పంచాయతీలు, వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డులకు చాలా తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. 

యాదాద్రిలో 110 నామినేషన్లు

రెండో విడతలో యాదాద్రి జిల్లాలోని ఐదు మండలాల్లోని 150 పంచాయతీలు, 1332 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. భూదాన్​ పోచంపల్లిలోని 21 పంచాయతీలకు 15 నామినేషన్లు, 192 వార్డులకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. భువనగిరిలో 34 పంచాయతీలకు 31 నామినేషన్లు, 294 వార్డులకు 64 దాఖలయ్యాయి. 

బీబీనగర్​లోని 34 పంచాయతీలకు 24 నామినేషన్లు, 284 వార్డులకు 53 దాఖలయ్యాయి. వలిగొండలోని 37 పంచాయతీలకు 17 నామినేషన్లు, 330 వార్డులకు 14 నామినేషన్లు వేశారు. రామన్నపేటలోని 24 పంచాయతీలకు 23 నామినేషన్లు, 232 వార్డులకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. 

యాదాద్రిలో 13 నామినేషన్ల తిరస్కరణ

యాదాద్రి జిల్లాలో నామినేషన్ల స్క్రూటినీ ముగిసింది. తుర్కపల్లిలో ఒక సర్పంచ్​, 9 వార్డు నామినేషన్లను​ తిరస్కరించారు. ఆత్మకూరు(ఎం)లో రెండు, బొమ్మల రామారంలో ఒక వార్డు నామినేషన్​ తిరస్కరించారు. 

సూర్యాపేట జిల్లాలో 

గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల నేపథ్యంలో 181 గ్రామ పంచాయతీ లలో నిర్వహిస్తుండగా సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు  67నామినేషన్లు నమోదయ్యాయి. చిలుకూరు మండలంలో 5, కోదాడ మండలంలో 4, అనంతగిరి మండలంలోని 6, మునగాల మండలంలో 10, నడిగూడెం మండలం లో 3, మోతే మండలంలో 9, చివ్వేంల మండలంలో 15, పెన్ పహద్ మండలంలో 13 నామినేషన్లు నమోదయ్యాయి. ఇక రెండవ విడత లో 1628 వార్డులో ఎన్నికలు జరగనుండగా మొదటి రోజు 38నామినేషన్లు నమోదయ్యాయి.