సెకండ్ సింగిల్ ఆన్ ద వే

సెకండ్ సింగిల్ ఆన్ ద వే

 కమల్ హాసన్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. జులై 12న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ రీసెంట్‌‌‌‌గా కమల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేస్తూ ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ సాంగ్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 29న రెండో పాటను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఇది సిద్ధార్థ్​, రకుల్ ప్రీత్ సింగ్‌‌‌‌ మధ్య సాగే పాటగా  రివీల్ చేస్తూ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో సిద్ధార్థ్​, రకుల్ స్టైలిష్ లుక్స్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు.  కాజల్ మరో హీరోయిన్‌‌‌‌గా  నటించిన ఈ చిత్రంలో  ఎస్‌‌‌‌జే సూర్య, బాబీ సింహా, మనోబాల, బ్రహ్మానందం, సముద్రఖని  ఇతర పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మించాయి. ఇరవై ఎనిమిదేళ్ల  తర్వాత  సీక్వెల్‌‌‌‌గా వస్తోన్న ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నాయి.